పూర్వం నల్లూరు అనే గ్రామంలో రామశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఆ ఊరి దేవాలయంలో పూజారిగా పని చేస్తూ ఉండేవాడు. రామశాస్త్రి అప్పుడప్పుడు ఆ ఊరి ప్రజలు తమ ఇళ్ళల్లో చేసుకొనే వ్రతాలు, పూజలను జరిపించి వాళ్ళు ఇచ్చే కొద్దిపాటి సంభావనలు తీసుకుంటూ కాలం గడిపేవాడు. రామశాస్త్రి భార్య సీతమ్మ ఆమె భర్త తెచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే కుటుంబాన్ని గుట్టుగా నడుపుకుంటూ ఉండేది. అయితే రామశాస్త్రి దంపతులకు ఉన్న ఏకైక బాధ వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళకి పెండ్లి అయ్యి 10 సం॥ములు గడిచినా సంతాన భాగ్యం కలగలేదు. దాంతో రామశాస్త్రి ఆయన భార్య ఎన్నో పూజలు, వ్రతాలు చేశారు. తీర్థయాత్రలు చేసి అనేక మంది దేవుళ్ళకి మ్రొక్కుకున్నారు. చివరికి వాళ్ళ పూజలు ఫలించి రామశాస్త్రి భార్య సీతమ్మ ఒక పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చింది. లేకలేక కలిగిన ఆ మగ బిడ్డకు ఏ లోపం కలగకుండా ఆ బిడ్డను పెంచసాగారు. రామశాస్త్రి ఇంట్లో ఒక ముంగిసని చాలా కాలంగా పెంచుకుంటున్నాడు. ముంగిస అంటే తెలుసు కదూ! అది ఉడత జాతికి చెందిన పెద్ద పరిమాణంలో ఉండే ప్రాణి. ముంగిసకు, పాముకి ఆజన్మ విరోధం ఉంది. ఎప్పుడైనా పాము, ముంగిస ఎదురెదురు పడి పోట్లా డుకుంటే ముంగిస తనతో పోరా...