ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కాకి తెలివి | నీతి కథలు | Moral Stories in Telugu

ఒకానొక గ్రామంలో ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో ఒక పెద్ద వేప చెట్టు, ఆ చెట్టు చుట్టూ ఒక పెద్ద పాము పుట్ట ఉన్నది. ఆ ఊళ్ళో జనాలు నాగులచవితినాడు ఆ పాము పుట్టలో పాలు పొసి పూజలు చేస్తుండేవాళ్ళు. అందులో ఒక దుష్టబుద్ధి గల పాము ఉండేది. అదే చెట్టుపైన చిటారు కొమ్మల్లో ఒక కాకి జంట గూడుకట్టుకొని కాపురం చేస్తుండేది.

కొన్నాళ్ళు గడిచాయి. ఆడ కాకి నాలుగు గుడ్లు పెట్టింది. మగ కాకి బయటికి వెళ్ళి ఆహారం తెచ్చి ఆడ కాకికి ఇస్తుండేది. ఆడ కాకి గూడు వదిలి బయటికి వెళ్ళకుండా తాను పెట్టిన గుడ్లపై కూర్చుని పొదుగుతూ ఉండేది. ఒక నెల రోజులకి కాకి గుడ్ల నుంచి చిన్న, చిన్న కాకి పిల్లలు బయటికి వచ్చాయి. నల్లగా, ముద్దుగా ఉన్న తమ పిల్లల్ని చూసి తెగ సంతోష పడ్డాయి కాకులు. మరి కాకి పిల్ల కాకికి ముద్దు అంటే అదే కదా! ఆ 

ఒకరోజు ఆకాకుల జంట, పిల్లల్ని గూడులో వదిలేసి ఆహారం కోసం ఊళ్ళోకి వెళ్ళాయి. ఆ సమయం కొసమే వేచి ఉన్న క్రింద పుట్టలోని విష సర్పం చర,చారా పాకి చెట్టు మీదకు వెళ్ళింది. కాకి పిల్లలు హాయిగా గూడులో నిద్రపోతున్నాయి. వాటిని చూసిన పాము మెల్లగా పడగను ఆ కాకి గూడులో ఉంచి, ఆ గూడులో ఉన్న కాకి పిల్లల్ని గుడుక్కున మింగి, మెల్లిగా చెట్టు దిగి పుట్టలోకి పోయి పడుకుంది.

మధ్యాహ్ననికి కాకుల జంట ఏదో ఆహారం ముక్కున కరుచుకొని గూడు దగ్గరకు వచ్చి చూస్తే, వాటి పిల్లలు లేవు. అక్కడ్కడ రెండు, మూడు కాకి పిల్లల రెక్కలు పడి ఉన్నాయి. తమ పిల్లల్ని చెట్టు క్రింద పుట్టలో ఉన్న సర్పం తినేసిందని వాటికి అర్థం అయి భోరున విలపించాయి. పాపం, ఆ బలహీన పక్షులు తమ బిడ్డల్ని మింగేసిన విషసర్పాన్ని ఏంచేయగలవు.

దిక్కులేని వాడికి దేముడే దిక్కుఅని గుండె దిటవు చేసుకొని మాములుగా జీవించసాగాయి. కొన్నాళ్ళకి మళ్ళీ ఆడకాకి గుడ్లు పెట్టింది. మళ్ళీ పిల్లలు పుడతాయన్న ఆనందం కన్నా, పాము మళ్ళీ తమ బిడ్డల్ని చంపుతుందన్న భయమే ఆ కాకి జంటకు అధికం అయింది. సరే దేముడి మీద భారం వేసి కాలం గడుపుతున్నాయి. ఆ జంట కాకులు.

కొన్నాళ్ళకి ఆ గుడ్ల నుండి చిన్న, చిన్న కాకి పిల్లలు బయటికి వచ్చాయి. ఈసారి చాలా జాగ్రత్తగా వంతులు వారిగా తమ పిల్లలకు కాపలా కాయసాగాయి కాకి దంపతులు.

ఒకసారి గత్యంతరంలేక రెండు కాకులు పిల్లల్ని గూడులో వదిలి బయటికి వెళ్ళాయి. సరిగ్గా అది కనిపెట్టిన చెట్టు క్రింద పుట్టలోని దుష్ట సర్పం గబ, గబా చెట్టుపైకి పాకి కాకి పిల్లల్ని గుడుక్కున మింగి, చెట్టు దిగి వచ్చేసింది.

గూడుకి తిరిగి వచ్చి చూసిన కాకులకు పిల్లలు కనిపించలేదు. దాంతో ఆ కాకుల జంట పిల్లల కోసం రోదించాయి. అయితే ఏడవటం వలన ప్రయోజనం ఏముంది అని మగ కాకి గ్రహించి, తమ బిడ్డల్ని చంపివేస్తున్న సర్పాన్ని ఎలా శిక్షించాలని నిర్ణయించుకొన్నది.

వెంటనే మగకాకి దగ్గరలో ఉన్న అడవిలో ఉన్న ఒక నక్క మిత్రుడి వద్దకు సలహాకోసం వెళ్ళింది. మగకాకి చెప్పినదంతా విని నక్క ఇలా అన్నది.

"మిత్రమా! బలవంతుడైన శత్రువుని యుక్తిగా మట్టు పెట్టాలి. మన శత్రువుని సంహరించే బలం మనకి లేనప్పుడు అతని కంటే బలమైన వాడిని, వాడిపైకి పురికొల్పి వాడిచే మన శత్రువును చంపించాలి. ఇదే నిజమైన మేధస్సు.

దానికి కాకి సంతోషించి, మిత్రమా! నీవన్నది నిజమే, అయితే సర్పాని కన్నా బలమైనవాడు ఎవడు? ఎక్కడుంటాడు? వాడిని ఎలా సర్పంపైకి రెచ్చగొట్టాలి? అంటూ ఆత్రుతగా ప్రశ్నించింది.

అప్పుడు నక్క ఇలా అన్నది. కాకి మిత్రమా! శాంతంగా విను. ఇక్కడికి దగ్గరలో ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి చెందిన ఒక యువరాణి, ప్రతిరోజు తన తోటలోని చెరువులో జలకాలాటలాడుతుంది. ఆ సమయంలో ఎవ్వరూ అక్కడికి రాకుండా ఆ తోట చుట్టూ గట్టి కాపలా ఉంటుంది. నీవు ఆ యువరాణి నగలో ఒక దానిని తెచ్చి, నీకు హాని చేస్తున్న పుట్టలో వెయ్యి.

ఆ హారాన్ని నీవు అపహరించి తీసుకెళ్ళి పుట్టలో వేయటం చూసి యువరాణి తాలుక సైనికులు ఆ హారం కోసం పుట్టత్రవ్వుతారు. అప్పుడు కనబడే సర్పాన్ని చంపుతారు. ఆ విధంగా నీకు పాము పీడ విరగడ అవుతుంది. ఆ పథకాన్ని విన్న మగ కాకి మిక్కిలి ఆనందించి, తన పగ తీరే రోజు కోసం ఎదురుచూడసాగింది.

ఒకరోజు మధ్యాన్నం ఎడవేడిమి తాళలేక యువరాణి తన తోటలోని చెరులో స్నానం చేద్దామని వెళ్ళింది. అక్కడ ఒకచోట తన దుస్తులు, ఆభరణాలు ఉంచి, చెరువులోకి దిగింది. సరిగ్గా అదే సమయానికి అదను కోసం వేచి చూస్తున్న మగ కాకి, గభాల్న ఒక ఖారీదైన హారాన్ని ముక్కున కరచుకొని ఎగిరి పోసాగింది.

అది గమనించిన యువరాణి పెద్దగా అరిచింది. దాంతో ఒడ్డున కూర్చున్న చెలికత్తెలు సైనికుల్ని పిలిచి, జరిగింది చెప్పి, కాకి దగ్గర నుండి హారాన్ని తెమ్మని చెప్పారు.

ఆకాశంలో ఒక వంద అడుగుల ఎత్తున కాకి, హారాన్ని ముక్కుతో పట్టుకొని ఎగురుచున్నది. క్రింద భూమి పైన సైనికులు పరిగెడుతూ పైన ఎగురుచున్న కాకిని అదిలిస్తున్నారు. హారం క్రింద పడవేయమని. కాకి అలా ఎగురుతూ ఊర్లో ఉన్న దేవాలయం దగ్గరున్న వేపచెట్టు దాకా వచ్చి, ఆ చెట్టు క్రింద ఉన్న పుట్టలోకి తన ముక్కున ఉన్న హారాన్ని లాఘవంగా జార విడిచింది.

కాకినే అనుసరించి వస్తున్న సైనికులు కాకి హారాన్ని పుట్టలో వదులటం చూసి గునపాలు తెచ్చి పుట్టను త్రవ్వ సాగారు. పైన పుట్టను త్రవ్వుతున్న శబ్దం విని పుట్టలో నిద్రిస్తున్న విష సర్పం బైటికి వచ్చి పుట్ట త్రవ్వుతున్న ఒక సైనికుడి కాలిని కాటువేయబోయింది. అంతే అది గమనించిన ఇంకో సైనికుడు తన చేతిలోని గునపంతో ఆ పాము తలపై ఒక దెబ్బ వేసాడు. ఆ పాము తలవాల్చేసింది. ఆ తర్వాత సైనికులు చచ్చిన పాముని దూరంగా పారేసి, పుట్టలోని హారాన్ని జాగ్రత్తగా బయటికి తీసి యువరాణికి అందించారు.

ఆనాటి నుండి కాకి దంపతులు పాము పీడ విరగడై ప్రశాంతంగా గడుపసాగాయి. అన్నట్టు ఇప్పుడు ఆ కాకి జంటకు నాలుగు చిన్న కాకి పిల్లలు ఉన్నాయి. వాటిని గారాబం చేస్తూ ఆ కాకుల జంట కాలాన్ని మర్చిపోయాయి.

నీతి : కొండంత బలం కన్నా, గులకరాయంత మేధస్సు ఘనకార్యాలు సాధిస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...