ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నువ్వా? నేనా? | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వ కాలంలో ఒక ఊరి చివర ఉన్న స్మశానంలో ఒక పెద్ద ఊడల మర్రి చెట్టుపైన అనేక వందల కాకులు జీవిస్తూ ఉండేవి. ఆ కాకుల రాజు పేరు నీలపర్ణుడు. అంటే నీలం రంగు రెక్కలు గలవాడు అని అర్థం. ఆ స్మశానానికి రెండు క్రోసుల దూరంలో ఉన్న కొండ గుహలో వేల కొద్ది గబ్బిలాలు జీవిస్తూ ఉండేవి. వాటి నాయకుడు నిశిరాజు. అంటే రాత్రికి రాజు. అంటే చంద్రుడు అని అర్థం.

ఇది ఇలా ఉండగా చెట్టుమీద ప్రశాంతంగా జీవిస్తున్న కాకులకి ఒక సమస్య వచ్చి పడింది. అదేమంటే కాకులకి రాత్రిపూట కనిపించదు. కానీ గుడ్ల గూబలకి రాత్రిళ్ళు మాత్రమే కళ్ళు కనిపిస్తాయి. అది రాత్రిళ్ళు మాత్రమే ఆహారం కోసం గుహ బయటికి వస్తుంటాయి. అందుకే గుడ్లగూబల్ని నిశాచరులు అంటారు. అంటే రాత్రిళ్ళు సంచరించే వాళ్ళు అని అర్థం.

గుడ్లగూబలకి, కాకులకి జన్మ విరోధం ఉన్నది. పైగా గుడ్లగూబలకి, కాకులు ఇష్టమైన ఆహారం. దాంతో గుహలోని గుడ్లగూబలు రాత్రి సమయంలో కాకులు నివాసం ఉంటున్న మర్రిచెట్టు పైకి దాడి చేసి కాకుల్ని చంపితింటూ ఉండేవి.

ఇలా గుడ్లగూబల దాడిలో ఇంకా రెక్కలు రాని కాకి పిల్లలు సైతం మరణించేవి. తన పాలనలో ఉన్న కాకులు ఇలా దిక్కుమాలిన చావు చావటంతో ఆ కాకుల రాజైన నీలపర్ణుడు చాలా విచారించి, తన మంత్రుల్ని పిలిచి ఏం చెయ్యాలి అని సలహా అడిగాడు.

అప్పుడు కొందరు మంత్రులు లేచి బలవంతులైన గుడ్లగూబల్ని మనం ఏం చేయలేం. అందువల్ల మనం క్షేమంగా ఉండే వేరే ప్రదేశానికి వెళ్ళటం మంచిది అని చెప్పారు.

అప్పుడు 'సుబుద్ధి' అనే ముసలి మంత్రి లేచి, నీలపర్ణుడితో ఇలా అన్నాడు. ఓ రాజా! నిజమైన వీరులెవరూ, శత్రువుని చూసి భయపడి మాతృదేశాన్ని వదలి పారిపోరు.

ఆ గుడ్లగూబలు బలమైనవే కావచ్చు. అంత మాత్రన మనం భయపడి పలాయన మంత్రం పఠించాల్సిన అగత్యం లేదు. బలవంతుడైన శత్రువుని యుక్తిగా సంహరించాలి. అప్పుడు కొన్ని కాకులు ముసలి మంత్రి మాటల్ని లెక్కించకుండా, గుడ్లగూబల దాడికి భయపడి వేరే చోటుకి వెళ్ళి తీరాలని పట్టుబట్టాయి.

అప్పుడు వృద్ధమంత్రి, కాకుల రాజైన నీలపర్ణుడికి ఇలా సలహా ఇచ్చాడు. ఓ రాజా! నీవు నీ పరివారంతో సహా ఇక్కడికి యోజనం దూరం (అంటే 8 మైళ్ళు)లో ఉన్న ఒక మహా వృక్షం పైన జీవించటానికి వెళ్ళిపో, వెళ్ళే ముందు నన్ను తీవ్రంగా గాయ పరిచినట్లు నటించు. అప్పుడు మన శత్రువులైన గుడ్లగూబల పక్షంలో చేరి వాళ్ళకి అనుకూలంగా నటిస్తూ, వీలు చూసి, వాళ్ళని సర్వనాశనం చేస్తాను.

అందుకు సమ్మతించి కాకుల రాజు అయిన నీలపర్ణుడు ముసలి కాకిని ముక్కుతో పొడిచి గాయపరచి నట్లు నటించి, ఒక చనిపోయిన కాకి రక్తం ముసలి కాకికి అంటించి చెట్టు మీద నుండి క్రిందికి తోసేసాడు.

ఆ తర్వాత ఆ నీలపర్ణుడు తన పరివారంతో సహా దూరప్రాంతంలో ఉన్న ఇంకొ చెట్టుపైకి నివశించటానికి ఎగిరి పోయాడు. ఆ రోజు రాత్రి గుడ్లగూబలు కాకులుండే చెట్టుపైకి దాడికి వచ్చాయి. కానీ అక్కడ కనీసం ఒక కాకి గుడ్డు కూడా కనిపించక ఆశ్చర్య పడ్డాయి.

అయితే ఆ చెట్టు క్రింద గాయాలతో పడి ఉన్న ముసలి కాకి కనబడింది. దాంతో గుడ్లగుబల రాజు నిశాచరుడు ఆ ముసలి కాకిని సమీపించి ఎవరు నీవు ఇలా పడి ఉన్నావు. మిగిలిన కాకులు ఎక్కడకి వెళ్ళాయి అని ప్రశ్నించాడు.

దానికి ముసలికాకి, దుఃఖ స్వరంతో ఇలా అన్నది. ఓ నిశాచర రాజా! నేను ఇక్కడ గతంలో ఉన్న కాకులకు మంత్రిని. మీరు మా కాకుల్ని రాత్రివేళలలో దాడిచేసి చంపుతున్నందుకు పగ పట్టిన మా రాజు నీలపర్ణుడు ఎలాగైనా మీ గుడ్లగుబల్ని అంతం చేస్తానని పంతం పట్టాడు.

అప్పుడు నేను కల్పించుకొని బలవంతులైన గుడ్లగూబలతో మనకి విరోధం తగదు. మనం మన కన్నా అధికులు అయిన గుడ్లగూబల్ని గౌరవించాలి అని చెప్పగా, మా రాజు నన్ను తీవ్రంగా గాయపరిచి, శత్రువులకి వంతపాడినందుకు, నన్ను ఈ చెట్టు మీద నుండి క్రిందికి తొసివేసి తన పరివారంతో హిమాలయాలకు ఎగిరి పోయాడు.

అప్పుడు గుడ్లగూబల రాజు నిశాచరుడు ముసలి కాకిని చూసి జాలి పడి తమ గుహకు వచ్చి హాయిగా జీవించమని అడిగాడు. దానికి ఇతర గుడ్లగూబలు అడ్డు చెప్పాయి. అవి వాటి రాజైన నిశాచరుడితో ఇలా అన్నాయి. "ఓ రాజా! ఈ కాకి మన ఆజన్మ శత్రువు. అలాంటి శత్రువుని కొరి కొరి మన ఇంట్లోకి ఆహ్వానించటం అంటే, కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే, కనుక ఈ కాకిని ఇలానే వదిలేసి మన దారిన మనం పొదాం.

అప్పుడు నిశాచరుడు మనల్ని శరణు కోరిన ఈ బలహీన, ముసలి కాకి వల్ల మనకి ఏలాంటి హాని ఉండదు అన్నాడు. దాంతో కొన్ని గుడ్లగూబలు రాబోయే ప్రమాదాన్ని శంకించి, వేరే గుహకు ఎగిరిపోయాయి. అటు పిమ్మట ముసలి కాకి గుడ్లగుబల గుహలో నివశించటం మొదలు పెట్టింది.

గుడ్లగూబలకి పగటి పూట కనిపించదు కనుక ముసలికాకి పగటి పూట అక్కడ, అక్కడ చిన్న చిన్న కర్రలు చితుకులు సేకరించి ఆ గుడ్ల గూబల గుహ ముఖద్వారం దగ్గర పేర్చసాగింది. అయితే బుద్ధిహీనులైన గుడ్లగూబలు కాకి చేస్తున్న కుటిల ప్రియత్నాలను తెలుసుకోలేక పోయాయి. ఇలా కొన్ని నెలలు గడిచాయి. కాకి, గుడ్లగూబల గుహ ద్వారం దగ్గర చాలా పరిమాణంలో చితుకులు, పిల్లలు నిల్వ చేసింది.

ఒక రోజు ఉదయం కాకులు నివాసం ఉంటున్న చెట్టు దగ్గరకు వెళ్ళి తమ రాజు నీలపర్ణుని కలిసి రేపు ఉదయం మీరంతా వచ్చి గుడ్లగూబలున్న గుహ ద్వారం ముందు ఉన్న చితుకుల్ని అంటించండి. అప్పుడు ఆ గుహలో ఉండే గుడ్ల జీవులు చనిపోతాయి. పగలు వాటికి కళ్ళు కనిపించవు. కనుక మీరు గుహ ద్వారం దగ్గర మంటలు పెట్టినా అవి బైటికి రాలేవు. అని చెప్పి మరలా గుడ్లగూబల గుహకి వచ్చింది.

పగలంతా కళ్ళు కనిపించని ఆ గుడ్లగూబలు కాకి బయటికి వెళ్ళి రావటం గమనించలేకపోయాయి. ఆ మర్నాటి ఉదయం కాకులన్నీ గుంపుగా వచ్చాయి. గుడ్లగూబలున్న గుహలో ఉంటున్న ముసలి కాకి బయటికి వచ్చి ఇంతకాలంగా తాను పొగుచేసి ఉంచినా చితుకులని ఆ గుహ ముఖ ద్వారానికి అడ్డంగా పేర్చి, ఆ పుల్లలకి నిప్పు అంటించమని కాకుల రాజు నీలపర్ణుడికి సలహా ఇచ్చింది.

దాంతో ఆ కాకుల రాజు, కొన్ని కాకుల్ని పిలిచి, ఎక్కడి నుండి అయిన ఒక మండే కట్టెను తెచ్చి గుహ ముఖ ద్వారం వద్ద పేర్చిన చితుకులకి నిప్పు అంటించమని ఆజ్ఞాపించాడు.

వెంటనే కాకులు రాజు చెప్పిన ఆజ్ఞని అక్షరాల అమలు చేసాయి. దాంతో ఆ గుహలో తల్లక్రిందులుగా వ్రేలాడుతున్న వేలాది గబ్బిలాలు, ఆ గుహలోంచి బయటికి రాలేక ఆ గుహలోనే అగ్ని సమాధి అయ్యాయి. ఈ విధంగా ముసలి కాకి నేర్పు, తెలివి, సాహసం వల్ల కాకులకి శత్రుభయం పోయింది. ఆనాటి నుండి ఆ కాకులు యథావిధిగా గతంలో నివశించిన ఊడల మర్రి చెట్టుపైనే నివాసం ఉండసాగాయి. 

నీతి : శత్రువుని చేరదీస్తే ప్రమాదం తప్పదు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...