ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చేటు తెచ్చిన సలహా | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం వేజండ్ల అనే గ్రామంలో పుల్లయ్య అనే నేత కార్మికుడు ఉండేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. పుల్లయ్య మగ్గం మీద బట్టలు నేసి, దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఉన్నంతలో హాయిగా జీవితం గడుపుతున్న పుల్లయ్యకి ఒకసారి ఒక సమస్య ఏర్పడింది. అదేంటంటే ఒకసారి అతని దగ్గరున్న మగ్గం విరిగి పోయింది. మళ్ళీ ఆ మగ్గాన్ని బాగుచేస్తేకానీ బట్టలు నేయలేడు. బట్టలు నేస్తేకానీ రోజు గడవదు.

దాంతో పుల్లయ్య తన గ్రామానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి మగ్గం కోసం ఒక చెట్టును కొట్టి, చెక్కలు తెద్దామని అనుకున్నాడు. దాంతో ఉదయమే నిద్రలేచి, చద్దన్నం మూట కట్టుకొని, భుజాన గొడ్డలి వేసుకొని అడవికి బయలుదేరాడు.

అడవికి చేరి, అక్కడున్న చెట్లను బాగా పరిశీలించాడు. ఏ చెట్టు తాలుకా చెక్క తన మగ్గానికి పనికి వస్తుందో అని. ఒక మంచి టేకు చెట్టుని ఎన్నుకొని దాన్ని నరకాటానికి గొడ్డలి ఎత్తాడు. సరిగ్గా అప్పుడు అతనికి వినబడింది ఒక మానవ స్వరం, ఆ స్వరం చెప్పిన మాట, మానవా, ఈ చెట్టుని నరకటం మానవా? పుల్లయ్య ఆశ్చర్యపడి చుట్టు చూసాడు. ఎవరూ కనబడలేదు. ఈ మాట అన్నది ఎవరో అర్థంకాక, పుల్లయ్య కాస్సేపు అలానే నిల్చుని, మళ్ళీ చెట్టు నరకటానికి గొడ్డలి ఎత్తి, చెట్టుపై వేశాడు. అంతే ఒక దేవతా స్త్రీ పుల్లయ్య ముందు ప్రత్యక్షమైంది. ఆమెను చూసి పుల్లయ్య ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. 

అప్పుడు ఆ దేవతా స్త్రీ పుల్లయ్యను చూసి ఇలా అన్నది. నాయనా పుల్లయ్యా! నేను ఈ చెట్టు మీద ఉంటున్న అడవి దేవతను, చాలా ఏళ్ళుగా ఈ చెట్టుపై నివశిస్తున్నాను. నీవు దయచేసి ఈ చెట్టుని కొట్టకుండా వదిలెయ్యి.

వనదేవత మాటలకి తేరుకున్న పుల్లయ్య ఆమెతో ఇలా అన్నాడుఅమ్మా దేవతా! నేను ఒక పేద నేత కార్మికుడిని. నా మగ్గం విరిగిపోయింది. అది బాగుచేసుకుంటేగానీ, నేను బట్టలు నెయ్యలేను. బట్టలు నేసి అమ్ముతేకానీ, నాకు పూట గడవదు. అతని మాటలకి జాలిపడి వనదేవత పుల్లయ్యతో ఇలా చెప్పింది.

బాబూ! నీవు ఈ చెట్టుని నరకటం మానేస్తే నీకు ఏదైనా వరం ఇస్తాను. సరేనా!

వనదేవత మాటలకు ఆనందించిన పుల్లయ్య, ఏ వరం కోరుకోవాలో మా గ్రామంలోకి వెళ్ళి అందర్నీ అడిగి వచ్చి అప్పుడు కొరతా నిన్ను వరం అన్నాడు వనదేవతతో. ఆమె సరే అని అంతర్ధానం అయింది.

పుల్లయ్య వేగంగా నడుచుకుంటూ తన గ్రామానికి బయలుదేరాడు. మధ్య మార్గంలో అతడికి అతని ముఖ్య స్నేహితుడు నాగరాజు కన్పించాడు. హడావుడిగా వెళ్తున్న పుల్లయ్యను చూసి పలకరించాడు.

పుల్లయ్య తను అడవికి వెళ్ళిన విషయం, వనదేవత వరం ఇస్తానన్న విషయం చెప్పాడు. ఏ వరం కోరుకుంటే బాగుంటుందంటావు అని మిత్రుడిని సలహా అడిగాడు.

పుల్లయ్య చెప్పిన విషయం విన్న నాగరాజు ఇలా అన్నాడు. పుల్లయ్య నువ్వు రాజువి కావాలని ఆ దేవతను కోరుకో, అప్పుడు నేను నీకు మంత్రిగా పనిచేస్తాను.

మిత్రుడి సలహా విన్న పుల్లయ్య నా భార్యను కూడా సలహా అడిగి ఆ తర్వాత ఏ వరం కోరుకోవాలో నిర్ణయించుకుంటాను అన్నాడు.

అప్పుడు నాగరాజు ఇలా అన్నాడు. పుల్లయ్య ఆడవాళ్ళని సలహాలు అడగ కూడాదు. వాళ్ళకి బుద్ధిసరిగా ఉండదు. కనుక నీ భార్యను సలహా అడగటం శుద్ధదండగా, పైగా ప్రమాదకరం. అయినా పుల్లయ్య ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుండి బయలు దేరి భార్య దగ్గరకు వెళ్ళి వనదేవత తనకి వరం ఇస్తానన్న విషయం చెప్పాడు.

అప్పుడు పుల్లయ్య భార్యకి, తన స్నేహితుడు, రాజుగా అయ్యేవరం ఇమ్మని అడగమని సలహా ఇచ్చాడని చెప్పాడు. పుల్లయ్య చెప్పింది విని, అతని భార్య ఇలా అన్నది -

ఒక దేశానికి రాజు అవటం అంటే వినటానికి గొప్పగా అనిపించవచ్చు. కానీ ఆపదవి ఎంతో కష్ట పురితం. శత్రురాజుల నుండి యుద్ధాలు ఎదుర్కొవలసి రావచ్చు. దేశంలో జరిగే కుట్రల్ని ఎదుర్కొవాల్సిరావచ్చు. పైగా ప్రజలకి వచ్చే అన్ని రకాల సమస్యన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ఎన్ని సుఖాలున్నా, మనశ్శాంతి ఉండదు.

అయితే ఏం వరం కోరుకోమంటావు అన్నాడు పుల్లయ్య. అప్పుడు పుల్లయ్య భార్య, ఏదైనా పని కొచ్చేవరం కోరుకో అన్నది. పని కొచ్చేవరం అంటే ఎలా ఉండాలి. అని అడిగాడు పుల్లయ్య. వరం నీకు, నీ వృత్తిలో పనికి వచ్చేలా ఉండాలి.

అదేలాగంటే నీకు ఇంకో తల, ఇంకో రెండు చేతులు ఇవ్వమని ఆ దేవతను కొరావనుకో నువ్వు ఏకకాలంలో రెండు మగ్గాలపై పని చేసి, ఎక్కువ బట్టలు నేసి చాలా సంపాదించుకోవచ్చు అన్నది అతని భార్య.

పుల్లయ్యకు భార్య ఇచ్చిన సలహా బాగా నచ్చింది. వెంటనే అడవికి వెళ్ళి, వనదేవతను రెండు చేతులు, ఒక తల అదనంగా ఇవ్వమని వరం కోరాడు.

వెంటనే ఆ వనదేవత తథాస్తు! అన్నది అంతే పుల్లయ్యకు అసలు తల వెనక భాగంలో ఇంకో తల, అసలు చేతుల క్రింద వెనుక వైపుగా రెండు చేతులు ఏర్పాడ్డాయి. వాటిని చూసి చాలా ఆనందించిన పుల్లయ్య వేగంగా నడుస్తూ తన గ్రామంలోకి ప్రవేశించాడు.

విచిత్రంగా కనిపించిన పుల్లయ్యను చూసి కుక్కలు పెద్దగా మొరిగాయి. ఊళ్ళోని జనాలు పుల్లయ్యను గుర్తు పట్టలేదు. పైగా అతడు మారురూపంలో ఉన్న రాక్షసుడేమో అని అనుమానించి రాళ్ళతో కొట్టి ఊరునుండి తరిమి వేసారు. అంతా చూస్తున్న పుల్లయ్య స్నేహితుడు చాలా బాధపడి ఇలా అనుకున్నాడు.

ఈ పుల్లయ్య తనకి వచ్చిన బంగారంలాంటి ఆవకాశాన్ని వృథా చేసుకొని, భార్య చెప్పిన బుద్ధితక్కువ సలహా విని వెర్రి వరం కోరి, కష్టాలను కొరి, కొరి ఆహ్వానించాడు. నేను చెప్పిన ప్రకారం వరం కొరి ఉంటే, హాయిగా ఈ పాటికి ఈ రాజ్యానికి రాజు అయి పాలిస్తూ ఉండేవాడు. అంత వాడి విధి వ్రాత ప్రకారమే జరుగుతుంది.


నీతి : ఇతరులు చెప్పే సలహాలు గుడ్డిగా అమలు చేస్తే ప్రమాదాలు తప్పవు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...